శత్రువులు దాడి చేసినపుడు ఏమి చేయాలి.. సివిల్ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్

By Sarath Chandra.B
May 08, 2025

Hindustan Times
Telugu

సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌లో భాగంగా ఆత్మరక్షణ చర్యల్ని  వివరిస్తున్న రైల్వే సిబ్బంది...

బాంబు దాడులు, కాల్పులు జరిగినపుడు నేలపై పడుకోవడం ద్వారా వాటి తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు.

శత్రువుల దాడుల్లో గాయపడిన వారికి రక్తస్రావం కాకుండా   ప్రథమ చికిత్స అందించాలి.

బహిరంగ స్థలాల్లో మంటలు వ్యాపించకుండా అగ్నినిరోధకాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. 

దాడుల్లో గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్న వారిని  సీపీఆర్‌ ద్వారా రక్షించవచ్చు. 

పేలుళ్లు జరిగినపుడు భారీ శబ్దాల నుంచి  మనల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. 

శత్రువుల దాడుల్లో గాయపడిన వారిని  రక్షించడానికి ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలి. 

అగ్నికీలలు వ్యాపించకుండా సివిల్ డిఫెన్స్‌లో భాగంగా  ప్రాథమిక చర్యలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 

గాయపడిన వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రులకు తరలించేందుకు  సహకరించాలి. 

దాడులు జరిగే సమయంలో  నేలపై పడుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. 

అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు, వస్తువుల గురించి భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలి. 

యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎటు నుంచి ఏ ముప్పు పొంచుకు వస్తుందో తెలియని వేళ పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధమై ఉండాలి.

కుజ సంచారం వల్ల జాక్ పాట్ కొట్టే రాశులు ఇవే

Canva