పుచ్చకాయను వేసవిలో ఏ సమయంలో తింటే మంచిది.. 8 ముఖ్యమైన విషయాలు

Image Source From Unsplash

By Basani Shiva Kumar
Mar 20, 2025

Hindustan Times
Telugu

ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్ చేయడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవచ్చు. మీ రోజును ప్రారంభించే విషయానికి వస్తే.. పుచ్చకాయ ఆరోగ్యకరమైన ఎంపికలలో ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే 90 శాతం నీరు, విటమిన్లు, మినరల్స్ ఇందులో ఉంటాయి.  

Image Source From Unsplash

మధ్యాహ్నం భోజనం తర్వాత పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

Image Source From Unsplash

వ్యాయామం తర్వాత శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. పుచ్చకాయలో నీరు శాతం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా హైడ్రేట్ అవుతుంది.

Image Source From Unsplash

సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పుచ్చకాయను స్నాక్‌గా తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.

Image Source From Unsplash

భోజనానికి అరగంట ముందు పుచ్చకాయ తినడం వల్ల ఆకలి తగ్గుతుంది.

Image Source From Unsplash

రాత్రిపూట తినకపోవడం మంచిది. రాత్రిపూట పుచ్చకాయ తినడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది, ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.

Image Source From Unsplash

పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగితే అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

Image Source From Unsplash

ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తినకూడదు. ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయలో పోషకాలు తగ్గుతాయి. 

Image Source From Unsplash

జుట్టు బలహీనమైపోయి రాలిపోతుందా? ఈ సీక్రెట్ టిప్స్‌తో సూపర్ స్ట్రాంగ్ చేసుకోండి!

Pixabay