బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Feb 06, 2025

Hindustan Times
Telugu

శరీరంలో మార్పులు వస్తే.. ఒక వైపు నవ్వడానికి ప్రయత్నించాలి. ముఖం ఒక వైపునకు వంగిపోతే, అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు.

Image Source From unsplash

రెండు చేతులను పైకి ఎత్తి చూసుకోవాలి. ఒక చేయి మరొకదాని కంటే తక్కువ ఎత్తుకు ఎత్తగలిగితే లేదా కిందికి జారిపోతే.. అది స్ట్రోక్‌కు సంకేతంగా భావించాలి.

Image Source From unsplash

సరళమైన పదాన్ని పునరావృతం చేయాలి. మాటలు తడబడితే లేదా అర్థం కాకపోతే, అది స్ట్రోక్‌కు సంకేతంగా ఉండవచ్చు.

Image Source From unsplash

అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, ముఖ్యంగా వాంతులు లేదా మైకం రావడం కూడా స్ట్రోక్ సంకేతంగా కావచ్చు.

Image Source From unsplash

అకస్మాత్తుగా దృష్టి మందగించడం, డబుల్ విజన్ లేదా ఒక కంటిలో చూపు కోల్పోవడం కూడా స్ట్రోక్ సంకేతంగా భావించాలి.

Image Source From unsplash

అకస్మాత్తుగా సమతుల్యత కోల్పోవడం, నడవడానికి ఇబ్బంది పడటం లేదా మైకం రావడం స్ట్రోక్ సంకేతంగా ఉండవచ్చు.

Image Source From unsplash

అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, మూర్ఛపోవడం లేదా గందరగోళంగా ఉండటం కూడా స్ట్రోక్ సంకేతమని నిపుణులు చెబుతారు.

Image Source From unsplash

ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. సమయం చాలా విలువైనది. వేగంగా చికిత్స చేయడంతో స్ట్రోక్ ప్రభావాలను తగ్గించుకోవచ్చు.

Image Source From unsplash

పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?