మహిళలు ఏ వయసులో ఏం తినాలి..

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 26, 2024

Hindustan Times
Telugu

కౌమారదశ ఎదుగుదలకు పుష్టి. ఈ దశలో శరీరం వేగంగా ఎదుగుతుంది. ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

Image Source From unsplash

రుతుస్రావం సమయంలో రక్తహీనత నివారణ కోసం.. ఇనుము అధికంగా ఉండే ఆహారాలు పచ్చని ఆకుకూరలు, బీట్‌రూట్, గుమ్మడికాయ, పొడిద్రాక్ష తీసుకోవాలి.

Image Source From unsplash

గర్భధారణ సమయంలో.. తల్లి, శిశువు ఆరోగ్యం కోసం పోషకాలు ఎంతో అవసరం. ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఇనుము అధికంగా ఉండే ఆహారాలు పచ్చని ఆకుకూరలు, పండ్లు, గింజలు తీసుకోవాలి.

Image Source From unsplash

రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా ఎముకల ఆరోగ్యం, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు పాలు, పెరుగు, చేపలు, గుడ్లు తినాలి. 

Image Source From unsplash

30 ఏళ్ల తర్వాత జీవక్రియ మందగించడం మొదలవుతుంది. అప్పుడు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.

Image Source From unsplash

40 ఏళ్ల తర్వాత గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు అవకాడో, నట్స్, చేపలు తీసుకోవాలి.

Image Source From unsplash

50 ఏళ్ల తర్వాత ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు పాలు, పెరుగు, చేపలు, గుడ్లు తీసుకోవాలి.

Image Source From unsplash

అన్ని వయసుల వారు నీరు తాగడం ఎంతో ముఖ్యం. నీరు శరీరాన్ని హైడ్రేట్ చేసి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

Image Source From unsplash

బంగాళదుంపలతో ఫ్రై మాత్రమే కాదు- ఇవి చేసుకున్నా నోరూరిపోతుంది! 

pixabay