ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఏం చేయాలి..? ఈ విషయాలు తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jan 03, 2025
Hindustan Times Telugu
ఎముకలు బలంగా ఉండటం చాలా అవసరం. లేకపోతే బలహీనంగా మారిపోతాం. చిన్న చిన్న పనులు కూడా చేయలేం.
image credit to unsplash
ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే విటమిన్ డీ, పాలు, గుడ్లు, చేపలు, ఎండు ద్రాక్షలు, సోయా బీన్ వంటి ఆహారాలను క్రమంగా తీసుకోవాలి.
image credit to unsplash
ప్రతి రోజు సుమారు గంటపాటు వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.
image credit to unsplash
మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. లిక్కర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎముకలు క్యాల్షియాన్ని ఎక్కువగా శోషించుకోలేవు.త్వరగా బలహీనపడే అవకాశం ఉంటుంది.
image credit to unsplash
బరువు తక్కువగా లేదా నీరసంగా ఉండటం వంటి సమస్యలు ఉన్నప్పుడు కాల్షియం పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే విటమిన్ డీ లేదా విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవాలి.
image credit to unsplash
ఎముకలు బలంగా ఉండాలంటే డి విటమిన్ చాలా అవసరం. అయితే ఉదయపు ఎండ ద్వారా శరీరానికి కావాల్సినంత డి విటమిన్ అందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
image credit to unsplash
ఎక్కువ సమయం నీడలో ఉండేవారికి ఎముకల బలహీనత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు రోజుకు 20 నిమిషాల పాటు ఎండలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.