జీర్ణవాహిక సంబంధిత వ్యాధుల చికిత్సలో యాపిల్ సైడర్ వెనిగర్‌, స్వచ్ఛమైన తేనె ఉపయోగపడతాయి..

By Sarath Chandra.B
Mar 06, 2025

Hindustan Times
Telugu

తేనెను ఆహారంలో మానవుడు దాదాపు 20వేల సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నట్టు స్పెయిన్‌లో  వెలుగు చూసిన చిత్రాల ద్వారా నిరూపితమైంది. 

అతిగా శుభ్రం చేసిన ఆధునిక ఆహార పదార్ధాల్లో లోపించిన విటమిన్లు, ఖనిజాలు, అమినోయాసిడ్లు, ఎంజైములు, తేనెలో పుష్కలంగా లభిస్తాయి. 

తేనెలో అయిదింట రెండు వంతులున్న డెక్స్‌ట్రోజ్‌ అనే  తీపి పదార్ధాన్నిజీర్ణ వాహిక ఎలాంటి జీర్ణ ప్రక్రియ చేయకుండానే శోషణం చేసుకుంటుంది. 

తేనెలో ఉండే లెవ్యులోజ్‌ అనే పదార్ధం నెమ్మదిగా జీర్ణమై రక్తంలో పంచదార శాతాన్ని అదుపులో ఉంచుతుంది. 

స్వచ్ఛమైన తేనెను మధుమేహ రోగులు కూాడ ఆహారంలో వినియోగించవచ్చు. 

జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వారు కూడా తేనెను ఆహారంగా తీసుకోవచ్చు. 

పోషక పదార్ధాల లోపం వల్ల, వ్యాదుల కారణంగా బలహీనమైన వారికి తేనె పూర్వపు శక్తిని సమకూరుస్తుంది. 

తేనె జీర్ణ ప్రక్రియ, మల విసర్జనను సమర్ధవంతంగా  సుగమం చేయడంలో ఉపయోగపడుతుంది. 

తేనెను ఆహారంగా వినియోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ ఉండవు. 

తేనెను వేడి చేయకుండా, ఎలాంటి వంట ప్రక్రియకు  లోను కాకుండా,  రుచిగా, సువాసనగా అందరూ వాడేట్లు ఉంటుంది. తేనెను వేడి చేసినా,  కాచినా దానిలో పోషకాలు నశిస్తాయి. 

తేనెలో ఇనుము, రాగి,  మాంగనీసు, సిలికా, క్లోరిన్, కాల్షియం, పొటాష్‌, సోడియం,  ఫాస్పరస్‌, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. 

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels