స్పెర్మ్ కౌంట్ పెరగటం ఎలా...? ఈ విషయాలను తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jan 05, 2025
Hindustan Times Telugu
ప్రస్తుత రోజుల్లో సంతానలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ ప్రాబ్లమ్‌కి ముఖ్యకారణం వీర్యకణాల సంఖ్య తగ్గడం. అయితే కొన్ని మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
image credit to unsplash
మగవారు చాలా మంది స్మోకింగ్ చేస్తుంటారు. అలాంటి వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి వారు పొగతాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. ఎందుకంటే ఇది వీర్యకణాల సంఖ్య తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.
image credit to unsplash
జంక్‌ఫుడ్, మద్యం వంటి వాటికీ దూరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది.
image credit to unsplash
పోషకాహారం, వ్యాయామంతో పాటు తగినంత నిద్ర ఉండాలి. బీపీ, మధుమేహం వంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
image credit to unsplash
స్పెర్మ్ కౌంట్ పెరగటంలో గుమ్మడి గింజలు బాగా పని చేస్తాయి. వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఇవి టెస్టోస్టీరాన్ హార్మోన్ ఉత్పత్తి పుంజుకునేలా చేస్తాయి. వీటిల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వీర్యం నాణ్యతనూ పెంచుతాయి.
image credit to unsplash
వీర్య కణాలు పెరగటంతో పాటు నాణ్యత కోసం జింక్ ఎక్కువ ఉండే ఆహారాలను తీసుకోవాలి. బార్లీ, చిక్కుళ్లు, మాంసం వంటి వంటి పదార్థాలను తీసుకోవాలి. ఇవి వీర్య కణాల సంఖ్య వృద్ధి కావటానికి తోడ్పడతాయి.
image credit to unsplash
పాలకూర వంటి ఆకుకూరలను క్రమంగా తీసుకోవాలి. వీటిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. వీర్యకణాలు ఎదగటానికి ఇది ఉపయోగపడుతుంది.
image credit to unsplash
నిద్ర మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన స్లీప్ పొజిషన్ లు తీవ్రమైన అనారోగ్యాలను మెరుగుపరచడం, నివారించడంలో సహాయపడతాయి.