తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Unsplash

By Anand Sai
Sep 03, 2024

Hindustan Times
Telugu

అక్కడ వర్ష పరిస్థితుల ఆధారంగా ఐఎండీ ఒక్కో ఏరియాకు ఒక్కో రంగుతో హెచ్చరికలు జారీ చేస్తుంది.

Unsplash

ఆయా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భారత వాతావరణ శాఖ నాలుగు కలర్​ కోడ్స్​ను జారీ చేస్తుంది.

Unsplash

గ్రీన్​, ఎల్లో, ఆరెంజ్​, రెడ్​ అలెర్ట్స్ ఉంటాయి. రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండొచ్చు అని అంచనా వేసి, సంబంధిత కోడ్స్​ను ఐఎండీ జారీ చేస్తుంది.

Unsplash

పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పుడు గ్రీన్​ కలర్ అలర్ట్​ జారీ చేస్తారు.

Unsplash

వాతావరణం ప్రతికూలంగా ఉండి అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్​‌ను జారీ చేస్తారు.

Unsplash

వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉందని, విద్యుత్​, రైలు, రోడ్డు, విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఆరెంజ్ అలర్ట్​ జారీ చేస్తారు.

Unsplash

ఇక పరిస్థితులు అత్యంత ఆందోళకరంగా ఉన్నప్పుడు.. ప్రజల జీవితాలకు ముప్పు పొంచి ఉందని చెప్పేందుకు రెడ్ అలర్ట్​ జారీ చేస్తారు.

Unsplash

ఎటు చూసినా నీరే- ఆంధ్రప్రదేశ్​లో వర్షాలకు ప్రజల కన్నీరు!

ANI