యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్‍తో బరువు వేగంగా తగ్గొచ్చా?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jan 15, 2025
Hindustan Times Telugu
బరువు తగ్గాలనుకునే వారికి యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ సూటవుతుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ డైట్ ఉపయోగపడుతుంది. వేగంగా బరువు తగ్గేందుకు ఈ డైట్ ఉపకరిస్తుంది.
Photo: Pexels
యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్‍లో ఎక్కువగా తింటే అవి శరీరంలో వాపు గుణాన్ని తగ్గిస్తాయి. వాపు ప్రక్రియను అడ్డుకుంటాయి. ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తినడమే యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్.
Photo: Pexels
యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ వల్ల బరువు తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ కూడా తగ్గుతుంది. పూర్తిస్థాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
Photo: Pexels
నారింజ, యాపిల్, బెర్రీలు లాంటి పండ్లలో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. క్యాబేజ్, క్యాలిఫ్లవర్, పాలకూర, బీట్‍రూట్ వంటి కూరగాయల్లోనూ ఇవి అధికం. అందుకే బరువు తగ్గాలనుకునే వారు డైట్‍లో ఇవి తీసుకోవాలి.
Photo: Pexels
ఆక్రోటు, బాదం, చియా, అవిసె, ఫ్లాక్స్, చియా లాంటి నట్స్, సీడ్లలో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వీటిని కూడా ఈ డైట్‍లో యాడ్ చేసుకోవాలి.
Photo: Pexels
పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాల్లో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు అధికం. వీటిని కూడా డైట్‍లో తీసుకుంటే వెయిట్ లాస్‍కు సహకరిస్తాయి.
Photo: Pexels
క్వినోవా, ఓట్స్, బ్రౌన్ రైస్ లాంటి చిరుధాన్యాల్లోనూ యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు మెండు. బీన్స్, పప్పులు, సోయా లాంటి పప్పు ధాన్యాలు కూడా ఈ డైట్‍లో ఉంటాయి.
Photo: Pexels
సాల్మోన్, మాకెరెల్, టునా లాంటి ఫ్యాటీ చేపలు కూడా యాంటీఇన్‍ఫ్లమేటరీ ఫుడ్సే. వెయిట్ లాస్ డైట్‍లో వీటిని కూడా తీసుకోవాలి.
Photo: Pexels
యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ చేసే వారు షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, ఫుడ్స్ తీసుకోకూడదు. ప్రాసెస్డ్, ఫ్రైడ్, జంక్ ఆహారాలకు దూరంగా ఉండాలి.
Photo: Pexels
పొద్దుతిరుగుడు విత్తనాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక రకాల వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి.