చిన్న పిల్లల చెవిలో దుర్వాసన రావడం దేనికి సంకేతం? 

Image Source From unsplash

By Basani Shiva Kumar
Jan 21, 2025

Hindustan Times
Telugu

చెవి మైనపు అధికంగా ఉత్పత్తి అయ్యి దుర్వాసన వస్తుంది. దీని కారణంగా నొప్పి వచ్చి పిల్లలు ఇబ్బందిపడతారు.

Image Source From unsplash

బ్యాక్టీరియా లేదా వైరస్‌లు చెవిలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. అప్పుడు చెవి నుండి ద్రవం వస్తుంది.

Image Source From unsplash

పిల్లలు తమ వేళ్లు లేదా చిన్న వస్తువులను చెవిలోకి పెట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. దీంతో నొప్పి, వినికిడి సమస్యలు.

Image Source From unsplash

కొన్ని అలెర్జీలు చెవిలో వాపు, దురదకు కారణమవుతాయి. ఇది దుర్వాసనకు దారితీస్తుంది. ముక్కు కారడం, కళ్లకు నీరు కారడం, తుమ్ములు వస్తాయి.

Image Source From unsplash

ఈస్ట్ లేదా ఇతర ఫంగస్‌లు చెవిలో పెరిగి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. వీటి కారణంగా చెవిలో దురద, ఎరుపు, గోధుమ రంగు ద్రవం వస్తుంది.

Image Source From unsplash

జలుబు లేదా సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల చెవిలో ద్రవం పేరుకుపోతుంది. దీనివల్ల కూడా దుర్వాసన రావచ్చు.

Image Source From unsplash

చెవి పొర పగిలిపోవడం వల్ల.. చెవిలో ఇన్ఫెక్షన్ ఏర్పడి దుర్వాసన రావచ్చు. దీనివల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. చెవి నుండి రక్తం, చీము వస్తుంది.

Image Source From unsplash

చెవిలో నొప్పిగా ఉన్నా, రక్తం, చీము వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వినికిడి సమస్యలు ఉన్నా, పిల్లలకు జ్వరం తగ్గకపోయినా వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలి. 

Image Source From unsplash

ఒక్క లైన్​తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్​లు ఇవి..