పిల్లలు ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Feb 17, 2025

Hindustan Times
Telugu

కూల్ డ్రింక్స్‌లో ఉండే చక్కెర, ఆమ్లాలు దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దీనివల్ల దంతాలు పుచ్చిపోవడం, సున్నితంగా మారడం వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

కూల్ డ్రింక్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల్లో ఊబకాయానికి దారితీస్తుంది. పిల్లల్లో ఊబకాయం అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉంది.

Image Source From unsplash

కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పిల్లలు సరైన ఆహారం తీసుకోలేకపోతారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందక బలహీనపడతారు.

Image Source From unsplash

కూల్ డ్రింక్స్‌లో కెఫీన్ ఉంటుంది. ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు గురవుతారు.

Image Source From unsplash

కూల్ డ్రింక్స్‌లో కెఫీన్ ఉండటం వల్ల.. పిల్లలు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు. నిద్రలో శరీర ఎదుగుదల హార్మోన్లు విడుదలవుతాయి. నిద్ర సరిగా లేకపోతే పిల్లల ఎదుగుదల మందగిస్తుంది.

Image Source From unsplash

కూల్ డ్రింక్స్‌లో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకల్లోని కాల్షియాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి.

Image Source From unsplash

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అజీర్ణం, వాంతులు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

Image Source From unsplash

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది పిల్లలలో అత్యంత సాధారణమే అయినా.. ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. 

Image Source From unsplash

వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యానికి నీరు చాలా కీలకం. రోజులో తగినంత నీరు తాగడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels