పెరుగుతో ఈ పదార్థాన్ని కలిపి తిన్నారంటే డబుల్, త్రిబుల్ ప్రయోజనాలను పొందొచ్చు! 

PIXABAY

By Ramya Sri Marka
May 07, 2025

Hindustan Times
Telugu

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పెరుగు లేకుండా భోజనం చేయడం అసంపూర్తిగానే ఫీలవుతారు. వేసవి కాలంలో అయితే దీని మరింత గిరాకీ ఉంటుంది.  

వేడి నుంచి తప్పించుకునేందుకు చల్లటి కమ్మటి పెరుగు చక్కటి ఆహార పదార్థంగా పనిచేస్తుంది. అయితే ప్రతిసారి పెరుగును ఊరికే తింటే ఏం బావుంటుంది. 

ఈ సారి పెరుగును మఖానాతో కలిపి తిని చూడండి. రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలుంటాయి. ఈ కాంబినేషన్ తో కలిగే అద్భుతాలేంటో చూద్దామా.

PEXELS

పెరుగు, మఖానా రెండింటిలోనూ కూలింగ్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కలిపి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది.

PIXABAY

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, మఖానాలోని ఫైబర్ కలిసి కడుపును శుభ్రంగా ఉంచుతాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

PIXABAY

మఖానాలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది.

PEXELS

పెరుగులో సహజంగా ఉండే మంచి బ్యాక్టీరియా, మఖానాలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని డిటాక్స్ చేస్తాయి. వేసవిలో మొటిమల నుండి రక్షిస్తాయి.

PIXABAY

మఖానా తక్షణ శక్తిని ఇస్తుంది. పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీని వలన రోజంతా అలసట లేకుండా చలాకీగా ఉంటారు.

మఖానాలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. దీనిని పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని, బీపీని సమతుల్యం చేస్తాయి.

స్పెర్మ్​ కౌంట్​ని అమాంతం తగ్గించే ఫుడ్స్​ ఇవి- జాగ్రత్తగా ఉండాలి!

pixabay