రాగి గ్లాసులోని పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..? వీటిని తప్పక తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 19, 2025
Hindustan Times Telugu
రాగి పాత్రలో ఏవైనా ద్రవాలు నిల్వ చేసి తాగితే మంచిదే. మరీ ముఖ్యంగా నీరు తాగడం చాలా మంచిది. అయితే పాలను మాత్రమే తీసుకోవద్దు.
image credit to unsplash
రాగి పాత్రలో లేదా గ్లాస్ లో నిల్వ చేసి నీటిని తాగడం ఆరోగ్యకరం. కానీ ఈ పాత్రలో తాగకూడని కొన్ని పానీయాలు, తీసుకోకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి.
image credit to unsplash
ముఖ్యంగా పాలతో పాటు సంబంధిత ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లో రాగి పాత్రలు లేదా గిన్నెల్లో నిల్వ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
image credit to unsplash
పాలు లేదా వాటి ఉత్పత్తులను రాగి పాత్రలో ఎక్కువసేపు నిల్వ ఉంచడం మంచిది కాదు. పాలలోని ఖనిజాలు, విటమిన్లతో రాగి చర్యలు జరుపుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది.
image credit to unsplash
రాగి అనేది లోహం. కాబట్టి వాటితో తయారు చేసే గ్లాస్ లేదా పాత్రలో ఉంచిన పాలను తీసుకుంటే వికారం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
image credit to unsplash
పాలు లేదా వాటి నుంచి వచ్చే పెరుగును కూడా రాగి పాత్రలో వేసుకుని తీసుకుంటే ప్రతిచర్యలు జరుగుతాయి. ఫలితంగా జీర్ణసమస్యలకు దారి తీస్తాయి.
image credit to unsplash
రాగితో తయారు చేసే పాత్రలు, గ్లాసుల్లో పాలు లేదా పెరుగు నిల్వ చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
image credit to unsplash
ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికిన ఒకే ఒక్కడు- ఎవరు ఈ విశ్వాస్?