చాక్లెట్లలో ఏముంటుంది, తింటే ఏమవుతుంది..

By Sarath Chandra.B
Mar 19, 2025

Hindustan Times
Telugu

చాక్లెట్లలో చక్కెర అధికంగా ఉంటుంది. ఘనీభవించిన పాలు ఉంటాయి. కోకో బట్టర్, కోకో పౌడర్ ఉంటుంది.

చాక్లెట్లలో రుచి కోసం రకరకాల పదార్ధాలను కలుపుతారు.

చాక్లెట్లలో కలిపే కోకో పౌడర్‌  రుచి చిరు చేదుగా ఉంటుంది. ఈ చేదును పోగొట్టడానికి  పంచదార కలుపుతారు.  చాక్లెట్లలో పంచదార 50శాతం వరకు ఉంటుంది. 

చాక్లెట్లలో రుచి కోసం చక్కెరను  సూక్రోజ్, లాక్టోజ్ రూపంలో కలుపుతారు. 

చాక్లెట్లను అధికంగా తింటే పంచదారను తినడమే అవుతుంది. 

చాక్లెట్లను అధికంగా తింటే బరువు పెరగడం, మత్తుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

చాక్లెట్లను అధికంగా తినడం వల్ల శరీరంలో  బి కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని వల్ల శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు లోపిస్తాయి.

కోకో గింజలలో ఉండే థియోబ్రోమైన్ మిశ్రమం వల్ల మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది. 

థియోబ్రోమైన్‌లో మెదడును ప్రేరేపించే గుణాలు ఉంటాయి. దీని వల్ల  ఒక దాని వెంట మరో చాక్లెట్‌ తినాలనిస్తుంది. 

మెదడును ప్రేరేపించే థియోబ్రోమైన్‌ వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, నిద్ర పట్టక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

చాక్లెట్లు చిన్న పిల్లల్లో ఎలర్జీలకు కారణం అవుతాయి.  ఒంటి  మీద దద్దుర్లు, వాంతులు ఏర్పడతాయి. 

చాక్లెట్లలో ఉండే కొవ్వు వాటిలో కోకో బట్టర్ కారణంగా వస్తుంది. 

చాక్లెట్లలో ఉండే శాచురేటెడ్  కొవ్వులు శరీరానికి చేటు చేస్తాయి. 

చాక్లెట్లలో ఉండే శాచురేటెడ్ కొవ్వులు 22 నుంచి 30శాతం వరకు ఉంటాయి. 

చాక్లెట్లలో ఉండే కొవ్వులు హార్డ్‌ ఫ్యాట్ కావడంతో వాటిని అరిగించుకోవడం కష్టం అవుతుంది.  చాక్లెట్లను అధికంగా తినే వారిలో ఊబకాయం ఏర్పడుతుంది. 

బెస్ట్ బైక్స్ అది కూడా రూ.2 లక్షల లోపు ధరలో..