టీ, కాఫీలకు బదులుగా బెల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం ద్వారా శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి.
image credit to unsplash
చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
image credit to unsplash
ప్రతిరోజూ బెల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. చక్కెరతో పోలిస్తే... బెల్లంలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
image credit to unsplash
బెల్లం టీ తాగటం వల్ల అజీర్తి, మలబద్ధకం, కడుపు మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
image credit to unsplash
బెల్లంలో పోషకాలు మెండుగా ఉంటాయి. కాల్షియం, పొటాసియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి. వీటితో శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.
image credit to unsplash
బెల్లం టీ తాగటం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గించే అవకాశం ఉంటుంది.
image credit to unsplash
ప్రతిరోజూ బెల్లం టీ తాగటం వల్ల అలసట, ఒత్తిడి తగ్గుతుంది. అయితే మరీ ఎక్కువ మోతాదులో కాకుండా తీసుకోకుండా తగిన రీతిలోనే తాగాలి.