ఆపిల్, బీట్ రూట్, క్యారెట్ కలిపి చేసే దాన్నే ఏబీసీ జ్యూస్ అంటారు. ప్రతిరోజూ దీని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
image credit to unsplash
ప్రతిరోజూ ఏబీసీ జ్యూస్ ను తాగితే రోగ నిరోధక శక్తి స్థాయిలు అమాంతం పెరుగుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లను నిల్వ కూడా శరీరంలో జరుగుతుంది.
image credit to unsplash
ఈ మూడింటితో చేసే జ్యూస్ లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయి.
image credit to unsplash
ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
image credit to unsplash
ఈ జ్యూస్ చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. సహజమైన రంగును ఇస్తాయి. చర్మంలో ఉన్న టాక్సిన్స్, మురికిని వదిలేస్తాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.
image credit to unsplash
బరువు తగ్గాలనుకునే వారికి ఏబీసీ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఫైబర్ లక్షణాలు రోజంతా మిమ్మల్ని తక్కువ ఆహారం తినేలా చేస్తాయి. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
image credit to unsplash
ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.