డయాబెటిస్ ఉన్న వారు చెరుకు రసం తాగితే ఏమవుతుంది?

By Haritha Chappa
May 25, 2024

Hindustan Times
Telugu

 చెరుకురసం చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ చూడగానే తాగేయాలనిపిస్తుంది.

వేసవి కాలంలో చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి మంచిది. కానీ డయాబెటిస్ ఉన్న వారు చెరుకురసం తాగకూడదని అంటారు. అది నిజమేనా?

చెరుకురసంలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు చెరుకురసానికి దూరంగా ఉంటేనే మంచిది.

డయాబెటిస్ అదుపులో ఉంటే ఒక అరగ్లాసు తాగవచ్చు. మధుమేహం అదుపులో లేని వారు, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే వారు చెరుకురసానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

డయాబెటిస్ లేని వారు కూడా రోజూ చెరుకు రసం తాగడం మంచిది. వారానికి రెండు మూడు సార్లు తాగవచ్చు. 

మండే ఎండల్లో తిరిగిన వారు మాత్రం చెరకు రసాన్ని వెంటనే తాగితే  శరీరానికి శక్తి అందుతుంది. 

చెరుకు రసంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. 

శరీరాన్ని డిటాక్స్ చేయగల 5 రకాల డ్రింక్స్ ఇవి

Photo: Unsplash