గుండె నొప్పి వచ్చే ముందు కళ్లల్లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?
Image Source From unsplash
By Basani Shiva Kumar Feb 18, 2025
Hindustan Times Telugu
కనురెప్పల చుట్టూ పసుపు రంగులో చిన్న కొవ్వు గడ్డలు కనిపిస్తే.. ఇది కొలెస్ట్రాల్ అధికంగా ఉందని సూచిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు దారితీస్తుంది.
Image Source From unsplash
రెటీనాలోని రక్తనాళాలు నేరుగా గుండె పరిస్థితిని ప్రతిబింబిస్తాయి. రెటీనాలో రక్తస్రావం, వాపు లేదా ఇతర మార్పులు గుండె జబ్బుల ప్రమాదాన్ని సూచిస్తాయి.
Image Source From unsplash
కంటి చూపులో ఆకస్మిక మార్పులు, మసకబారడం లేదా దృష్టి కోల్పోవడం గుండెపోటుకు సంకేతం కావచ్చు.
Image Source From unsplash
కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్లని లేదా బూడిద రంగు వలయం ఏర్పడటం వృద్ధాప్యంలో సాధారణం. కానీ యువకులలో కనిపిస్తే ఇది కొలెస్ట్రాల్ అధికంగా ఉందని సూచిస్తుంది.
Image Source From unsplash
కళ్లు తరచుగా ఎర్రబారడం, రక్తనాళాలు ఉబ్బినట్లు కనిపించడం గుండె సంబంధిత సమస్యలకు సూచన కావచ్చు.
Image Source From unsplash
తరచుగా కళ్లు పొడిబారడం, దురదగా ఉండటం లేదా మంటగా అనిపించడం గుండె సంబంధిత సమస్యలకు సూచన కావచ్చు.
Image Source From unsplash
కంటి చూపులో ఆకస్మిక మార్పులు.. ముఖ్యంగా ఒక కన్నులో మార్పులు గుండెపోటుకు సూచన కావచ్చు. కంటిలో రక్తస్రావం కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు.
Image Source From unsplash
కీళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!