పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?

By Sarath Chandra.B
Mar 27, 2025

Hindustan Times
Telugu

పురుషుల్లో వంధ్యత్వాన్ని పూర్తి వంద్యత్వం, పాక్షిక వంద్యత్వాలుగా చూడొచ్చు. పూర్తి వంధ్యత్వంలో  దానికి కారణాలను సరిచేసినా పిల్లలు పుట్టరు. పాక్షిక వంద్యత్వంలో కారణాన్ని సరిచేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి.

కొందరు మగవారిలో పుట్టుకతోనే బీజకోశంలోకి వృషణాలు దిగకుండా పొత్తి కడుపులోనే ఆగిపోతాయి. దీనిని అన్‌డిసెండెడ్‌ టెస్టిస్‌ అంటారు. వీరి దాంపత్య జీవితం  సాధారణంగా ఉన్నా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు.

కొందరిలో పుట్టుకతోనే జననేంద్రియ వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల వీర్య కణాలు ప్రయాణించే దారికి అవరోధం ఏర్పడి వంధ్యత్వానికి దారి తీస్తుంది. ఈ అవరోధాన్ని శస్త్ర చికత్సతో సరిచేయవచ్చు.

వెరికోసిల్ ఉన్న వారిలో వృషణంనుంచి రక్తాన్ని పైకి తీసుకువెళ్లే రక్త నాళాలు ఉబ్బి ఉంటాయి. వీటిని శస్త్రచికత్సతో సరిచేయవచ్చు.

పురుషుల్లో కొందరికి మూత్ర ద్వారం చివరిలో కాకుండా మొదట్లో కానీ మధ్యలో కాని ఉంటుంది. ఇలా ఒకటికి మించి అసహజ మూత్ర ద్వారాలు ఉన్న పరిస్థితిని హైపోస్పోడియాస్‌ అంటారు.

మూత్రం, వీర్యం మధ్యలోనే పడిపోవడం వల్ల స్త్రీ శరీరంలోకి వీర్యం ప్రవేశించే అవకాశం ఉండదు.దీనిని శస్త్ర చికిత్స ద్వారా సరిచేయవచ్చు.

కొందరిలో క్రోమోజోములలో తేడాలు వల్ల వీర్య కణాలు అతి తక్కువగానూ లేదా అసలు ఉత్పత్తి కాకుండా  పోవచ్చు. వంధ్యత్వానికి గురయ్యే వారిలో 10శాతం మందిలో ఇలా జరుగుతుంది.

ఇంగ్వైనల్ హెర్నియా, హైడ్రోసిల్‌ వంటి ఆపరేషన్లు జరిగినపుడు అరుదుగా  అవరోధాలు ఏర్పడి వంధ్యత్వానికి దారి తీయొచ్చు.

వృషణాలకు క్ష‍య, ఫైలేరియా వ్యాధి సంక్రమించినా వంధ్యత్వం రావొచ్చు.

మూత్ర మండలం వ్యాధులు దీర్ఘకాలం ఉన్న వారిలో, ప్రొస్టేటు గ్రంథి సరిగా పనిచేయని వారిలో వంధ్యత్వం వస్తుంది.

వీర్యం బయటకు వచ్చే మార్గం మూసుకుపోయినా పిల్లలు పుట్టక పోవచ్చు.

చిన్నతనంలో గవద బిళ్లలు వచ్చి దాని వల్ల వృషణాలు దెబ్బతిన్నా వీర్య కణాలు దెబ్బతిని వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుంది.

కొందరిలో సొంత వీర్య కణాలకు యాంటీబాడీస్‌ తయారై వీర్య కణాల ఉత్పత్తి దెబ్బతింటుంది. 

వేడి ప్రదేశాల్లో పనిచేసే వారిలో, స్థూలకాయుల్లో హార్మోనుల ఉత్పత్తి దెబ్బతిని శుక్ర బీజ కణాలు ఉత్పత్తి తగ్గుతుంది.

బిగుతుగా ఉండే అండర్ వేర్‌లు ధరించే వారిలో కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది. 

చిన్నతనంలో గవద బిళ్లలు వచ్చి దాని వల్ల వృషణాలు దెబ్బతిన్నా వీర్య కణాలు దెబ్బతిని వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుంది.

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త