వర్షాకాలంతో పాటు చలికాలం వేళ దగ్గు, జలుబు వంటి పలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటితో పాటు గొంతు గరగర కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
image credit to unsplash
గొంతు గరగర సమస్య చాలా ఇబ్బందికి గురి చేస్తుంటుంది. గొంతులో నొప్పితో పాటు ఒకరమైన ఫీలింగ్ ఉంటుంది. కొన్ని రకాల చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
image credit to unsplash
కాసిన్ని గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం సమస్య తగ్గుముఖం పడుతుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
image credit to unsplash
గొంతులో గరగర ఉంటే అల్లం తీసుకోవాలి .అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
image credit to unsplash
విటమిన్ సి ఎక్కువగా ఉంటే పండ్లను తినడం వల్ల గొంతులో గరగరను తగ్గించుకోవచ్చు. వీటిల్లోని యాంటీ హిస్టమైన్ ఎలర్జీలను క్రమంగా తగ్గిస్తాయి.
image credit to unsplash
గరగర సమస్యను తగ్గించుకునేందుకు గ్రీన్‌టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్‌టీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, యాంటీ ఎలర్జిటిక్ ఏజెంట్లు అధికంగా ఉంటాయి.
image credit to unsplash
పుదీనా ఆకుల్ని నీటిలో వేసి మరిగించాలి. రుచికి కొద్దిగా తేనె, లేదా బెల్లం కలుపుకొని తాగవచ్చు. అంతేకాకుండా అల్లం,శొంఠి,మిరియాలు, కొద్దిగా తులసి దళాలు వేసి కషాయంలా చేసుకొని తాగితే కూడా ఉపశమనం ఉంటుంది.
image credit to unsplash
క్యాబ్‌లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్‌ని మర్చిపోకండి!