ముక్కులో కండ పెరిగితే ఏమవుతుంది..? ఈ 6 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 07, 2025

Hindustan Times
Telugu

శరీరంలో ముక్కు ఆరోగ్యం చాలా ముఖ్యం. లేకపోతే అనేక సమస్యలకు కారణమవుతుంది. శ్వాస ఇబ్బందులతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. 

image credit to unsplash

ముక్కులో శ్వాసరంద్రాలు ఉంటాయి. ఇవి కొన్ని సార్లు జలుబు లేకపోయినా మూసుకుపోతుంటాయి. ఫలితంగా శ్వాస ఇబ్బందులు వస్తాయి. అంతేకాదు అనేక రకాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. 

image credit to unsplash

బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ లాంటివి సోకినప్పుడు ముక్కులోపలి పొర వాపు వస్తుంది. దీంతో పాలిప్స్‌ ఏర్పడుతాయి. వీటిని కండలు లేదా గడ్డలు అని కూడా అంటారు.

image credit to unsplash

ముక్కులో గోలీల మాదిరిగా ఈ కండలు ఏర్పడుతాయి. ఫలితంగా గాలి తీసుకోవటం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అంతేకాదు కళ్ల నుంచి నీళ్లు కారుతుంటాయి.

శ్వాసరంద్రాలు ఇలా మూసుకొనిపోవటం వల్ల గొంతుతో పాటు చెవిలోకి కూడా ఇన్ఫెక్షన్లు పాకుతాయి. ఫలితంగా నొప్పి వస్తుంది. 

image credit to unsplash

ఈ కండలు ఎక్కువగా ఉంటే పదే పదే తుమ్ములు వస్తుంటాయి. చాలా ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అయితే వీటి సైజ్ మరీ ఎక్కువగా ఉంటే సర్జరీ ద్వారా తొలగిస్తారు. 

image credit to unsplash

కండల సైజ్ తక్కువగా ఉంటే  మందులతో తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు ఈఎన్ టీ వైద్యులను వెంటనే సంప్రదించటం ఉత్తమం. 

image credit to unsplash

శని దోషం తొలగిపోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!