బ్రెయిన్ క్యాన్సర్.. మీలో ఎప్పుడైనా ఈ లక్షణాలు కనిపించాయా?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Mar 24, 2025

Hindustan Times
Telugu

తలనొప్పి.. ఇది బ్రెయిన్ క్యాన్సర్ సాధారణమైన లక్షణం. ఉదయం పూట తలనొప్పి తీవ్రంగా రావడం, వాంతులు రావడం, దగ్గినప్పుడు లేదా భంగిమ మార్చినప్పుడు నొప్పి పెరగడం వంటివి కనిపిస్తాయి.

Image Source From unsplash

తరచుగా వికారం, వాంతులు రావడం, కంటి చూపు మందగించడం, చూపు మసకబారడం, చూపు కోల్పోవడం వంటికి కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు.

Image Source From unsplash

నడవడం, మాట్లాడటంలో ఇబ్బంది కలుగుతుంది. నడకలో తూలడం, మాట తడబడడం వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

వినికిడిలో ఇబ్బందులు వస్తాయి. చెవులు సరిగ్గా వినపడకపోవడం, ఒక చేయి లేదా కాలులో కదలికలు కోల్పోవడం వంటివి కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు.

Image Source From unsplash

మూడ్ స్వింగ్స్, కోపం, చిరాకు, డిప్రెషన్, జ్ఞాపకశక్తి తగ్గడం, విషయాలు గుర్తుండకపోవడం, గందరగోళానికి గురికావడం కూడా దీని లక్షణాలు.

Image Source From unsplash

మానసిక సామర్థ్యం తగ్గడం, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. మాటలు స్పష్టంగా రావు.

Image Source From unsplash

రాయడానికి కూడా ఇబ్బంది కలగుతుంది. ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన బ్రెయిన్ క్యాన్సర్ అని కచ్చితంగా చెప్పలేము. 

Image Source From unsplash

ఈ లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Image Source From unsplash

అలియా భట్ నుంచి కత్రినా కైఫ్ వరకు: బాలీవుడ్ భామలను అందమైన పురుషులుగా మార్చిన ఏఐ

Photo Credit: Instagram/@ai.meme.nation