ఎముక క్యాన్సర్ లక్షణాలు, కారణాలేంటి..? ఈ 7 విషయాలు తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 28, 2025
Hindustan Times Telugu
క్యాన్సర్ అనేది అసాధారణ కణాల పెరుగుదలతో కూడిన వ్యాధి సమూహం. ఇది శరీరంలోని ఇతర భాగాలపైన దాడి చేసే లేదా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది.
image credit to unsplash
క్యాన్సర్లలో అనేక రకాలు ఉంటాయి. అందులో ఒకటిగా బోన్(ఎముక) క్యాన్సర్ ఉంది. ఎముక లోపల ఉద్భవించటాన్ని బోన్ క్యాన్సర్ అంటారు.
image credit to unsplash
బోన్ క్యాన్సర్ వచ్చిన వారిలో ప్రధానంగా ఎముక ప్రభావితమవుతుంటుంది. ఇందులో ఆస్టెయోసార్సోమా, కాండ్రోసార్కోమా, ఎవింగ్స్ సార్కోమా వంటి రకాలు కూడా ఉంటాయి.
image credit to unsplash
బోన్ క్యాన్సర్ లక్షణాలు చూస్తే ప్రభావిత ప్రాంతంలో ముందుగా సాధారణ నొప్పి ఉంటుంది. దశలు మారుతుంటే... నొప్పి తీవ్రమవుతుంది. అంతేకాదు నొప్పి తర్వాత ప్రాంతంలో వాపు ఉండవచ్చు.
image credit to unsplash
అసాధారణ స్థాయిలో ఎముకలు బలహీనపడటం, బరువు తగ్గటం, అలసట, తిమ్మిరి వంటి లక్షణాలు కూడా బోన్ క్యాన్సర్ కు సంకేతాలుగా ఉంటాయి.
image credit to unsplash
శరీరంలోని డీఎన్ఏ లో ఉత్పరివర్తనలు లేదా అనియంత్రిత పద్ధతిలో సాధారణ కణాలు వృద్ధి కావటం లేదా జన్యుపరంగా కూడా ఈ వ్యాధి రావొచ్చు. అయోనైజింగ్ రేడియేషన్‌కు ఎముకలు గురికావడం వల్ల కూడా కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
image credit to unsplash
బోన్ క్యాన్సర్ లో కణాల వ్యాప్తిని బట్టి దశ I నుంచి దశ IV వరకు పురోగమిస్తుంది. దీన్ని బట్టి వ్యాధి తీవ్రతను వైద్యులు అంచనా వేస్తారు. ఇందుకు అనుగుణంగా చికిత్స అందిస్తారు.
image credit to unsplash
ప్రారంభ దశలోనే ఎముక క్యాన్సర్ ను గుర్తిస్తే... సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. స్టేజ్ ను బట్టి సర్జరీ లేదా కీమోథెరపీ,రేడియేషన్ థెరపీ,క్రెయోసర్జరీ వంటి చికిత్సలను అందిస్తారు.
image credit to unsplash
సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి