గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 17, 2025

Hindustan Times
Telugu

శరీరంలో గుండె ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు వస్తాయి. 

image credit to unsplash

గుండెనొప్పి వచ్చే కొన్ని రోజుల ముందు నుంచే ఛాతీలో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి గ్యాస్, అసిడిటీ వచ్చినప్పటి నొప్పి కంటే ఎక్కువగా ఉంటుంది. దీన్నిబట్టి మనం అలర్ట్ కావొచ్చు.

image credit to unsplash

శ్వాస తీసుకోవటంలోనూ ఇబ్బంది ఉంటుంది. ఛాతిలో పదే పదే నొప్పి వస్తుంది.

image credit to unsplash

చిన్న పనులకే నీరసపడుతుంటారు. కొద్దిగా నడిచినా ఆయాస పడుతుంటారు.  

image credit to unsplash

కొందరిలో దవడ భాగం , మెడ, జీర్ణాశయం పైభాగంలో నొప్పిగా ఉంటుంది. ఈ లక్షణం కూడా గుండెపోటుకు సంకేతమని చెప్పొచ్చు.

image credit to unsplash

ఒకటి రెండు రోజులకు మించి ఎడమ చేయి నొప్పిగా ఉంటే అలర్ట్ అవ్వాలి.  అలాకాకుండా రెండు చేతుల్లో కూడా కొన్నిసార్లు నొప్పి వస్తుంటుంది.

image credit to unsplash

ఎలాంటి పని చేయకున్నా ఒక్కసారిగా చెమట పడుతుంటే ఆలోచించొద్దు. ఇది కూడా గుండెనొప్పికి ముందు కనిపించే లక్షణమే. ఇలాంటి లక్షణాలు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

హైదరాబాద్ టు కేరళ - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి

image credit to unsplash