ఉసిరి ఎంతో ఆరోగ్యకరమైనది. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావొచ్చు.
image credit to unsplash
ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరిని తీసుకుంటే... మరింత తీవ్రతరమవుతుంది
image credit to unsplash
ఉసిరిలో అధిక మొత్తంలో టానిన్లు ఉంటాయి. ఇవి ప్రేగులపై ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు మలబద్ధకానికి దారితీస్తాయి.
image credit to unsplash
ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే, అది కడుపు సమస్యలు, విరేచనాలు, డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.
image credit to unsplash
ఉసిరి మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో నిర్జలీకరణ, బరువు తగ్గడానికి కూడా దారితీస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉసిరి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
image credit to unsplash
సర్జరీ చేయించుకోవాలని అనుకున్న వారు కనీసం 2 వారాల పాటు ఉసిరిని తినకూడదు. మధుమేహం ఉన్నవారు ఉసిరి తినాలనుకుంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలి.
image credit to unsplash
టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉసిరి మంచిదని భావించినప్పటికీ, రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారికి మంచిది కాదు.