ఎక్కువ సందర్భాల్లో కాళ్ల వాపులు అంటే మోకాళ్ల కింద భాగంలో వచ్చే వాటినే కాళ్ల వాపులుగా పరిగణిస్తారు.
చీలమండల వాపు, పాదం వాపు కూడా కాళ్ల వాపుల్లో భాగంగానే వస్తాయి.వాపు వచ్చిన భాగంలో నొక్కితే గుంట పడుతుంది.
ఎక్కువ సేపు నిలబడినా, కూర్చొన్నా, కూర్చుని ప్రయాణాలు చేసినా కాళ్ల వాపులు వస్తుంటాయి.శరీరంలో కొన్ని అవయవాలు సక్రమంగా పనిచేయక పోవడం వల్ల కూడా కాళ్ల వాపులు వస్తుంటాయి.
ఎక్కువ సేపు నిలబడటం, కూర్చోవడం వల్ల వచ్చే కాళ్ల వాపుల్లో ఇతర సమస్యలు ఏమి కనిపించవు.ఇందులో కాళ్లకు వాపులు మాత్రమే ఉంటాయి. కొద్దిసేపు నడిచినా, కాళ్లు ఎత్తులో పెట్టుకున్నా ఇవి తగ్గిపోతాయి.
గుండె జబ్బుల్లో కాళ్ల వాపులు కనిపిస్తాయి. గుండెలోని కుడివైపు భాగం సక్రమంగా పనిచేయక పోతే శరీరం నుంచి గుండెకు చేరే రక్తాన్ని, వచ్చిన రక్తాన్ని వచ్చినట్టు కుడి జఠరికలోకి, పుపుస ధమనిలోకి పంపడంలో సమస్యలు వస్తాయి. ఫలితంగా కాళ్లకు వాపులు వస్తాయి.
గుండె జబ్బులు ఉన్న వారిలో కాళ్ల వాపులతో పాటు ఆయాసం కూడా ఉంటుంది.రోజుకు కనీసం అరగంట నుంచి గంట పాటు నడిచే వారిలో కాళ్ల వాపులు కనిపించవు.
కాలేయంలో సిర్రోసిస్ ఏర్పడితే పొట్టలోకి నీరు చేరుతుంది. ఇందులో కూడా కాళ్ల వాపులు కనిపిస్తాయి.
మూత్రపిండాల సమస్య ఉన్న వారిలో ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖం వాపు కనిపిస్తుంది. పొట్టలో నీరు చేరుతుంది. కాళ్లలో వాపులు ఉంటాయి.
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినా కాళ్లలో వాపులు వస్తాయి. రక్తంలో మాంసం కృతులు తగ్గినా కాళ్ల వాపులు కనిపిస్తాయి.
రక్తపోటులో గుండె బలహీనంగా మారితే కూడా కాళ్లలో వాపులు వస్తాయి.
కాళ్లలో వాపుల వల్ల చర్మం దెబ్బతిని పుండ్లు పడే ప్రమాదం ఉంటుంది.కాళ్లలో మొదలైన నొప్పులు క్రమేణా శరీరం మొత్తం వ్యాపించవచ్చు.
కాళ్లు వాపులు తగ్గాలంటే ఉప్పులు తగ్గించాలి, నిల్వ పచ్చళ్లు తినకూడదు. గుండె జబ్బులున్న వారు కాళ్లను ఎత్తులో పెట్టకూడదు.
బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గాలి. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తే కాళ్లలో వాపులు క్రమంగా తగ్గుతాయి. గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో కూడా కాళ్ల వాపులు ఉంటాయి.
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు