ఈ లక్షణాలు ఉంటే శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్టే! తప్పక తెలుసుకోండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Mar 24, 2025
Hindustan Times Telugu
చాలా మంది శరీరంలో ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. కానీఎక్కువ శాతం వారు గుర్తించలేరు. ఐరన్ లోపాన్ని అనేమియా (రక్తహీనత) అని కూడా పిలుస్తారు. ఇది ఉండే శరీరంలో రక్తం కూడా తగ్గిపోతుంది.
Photo: Pexels
శరీరంలో ఐరన్ లోపం ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఉంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఐరన్ తక్కువగా ఉంటే కనిపించే సంకేతాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. తరచూ నీరసంగా ఫీల్ అవుతుంటారు. ఎక్కువ పని చేయకుండానే అలసిపోతుంటారు.
Photo: Pexels
ఐరన్ లోపం ఉంటే చర్మం కూడా పాలిపోయినట్టుగా అనిపిస్తుంది. గోర్ల మెరుపు కూడా తగ్గి. పెళసుగా అవుతాయి. చర్మంలో మార్పులు కనిపిస్తాయి.
Photo: Pexels
శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే తరచూ తలనొప్పి వస్తుంది. మబ్బుగా, మైకం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కళ్లు కూడా తిరుగుతుంటాయి.
Photo: Pexels
పైలక్షణాలు కనిపిస్తే వెంటనే శరీరంలో ఐరన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో పరీక్షలు చేయించుకోవాలి. ఐరన్ లోపం ఉంటే వెంటనే తగిన జాగ్రత్తలు పాటించాలి.
Photo: Pexels
పాలకూర, బీన్స్, శనగలు, నువ్వులు, సోయా బీన్స్ సహా కాయధాన్యాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆక్రోటు, పిస్తాలు, అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, చియా గింజలు లాంటి వాటిలో ఐరన్ పుష్కలం. బీట్‍రూట్, క్యారెట్, మునగాకులోనూ ఇది అధికంగా ఉంటుంది.
Photo: Pexels
సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి