చర్మ ఆరోగ్యానికి ఉల్లి ఆకు తినండి..! 6 సరైన కారణాలు
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 24, 2025
Hindustan Times Telugu
ఉల్లిపాయలే కాదు ఆకులను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
image credit to unsplash
ఉల్లి ఆకుల్లో ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు, సల్ఫర్ వంటి సమ్మేళనాలు కనిపిస్తాయి. ఇవి మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడతాయి.
image credit to unsplash
ఉల్లి ఆకుల్లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. వీటిలోని పోషకాలు మరింత యవ్వనంగా కనిపించడానికి దోహదం చేస్తాయి.
image credit to unsplash
ఉల్లి ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వీటిలోని సల్పర్ సమ్మేళనాలు చర్మానికి ఉపశమనం కలిగించటం లేదా చికాకును తగ్గించడంలో సహాయపడుతాయి.
image credit to unsplash
ఉల్లి ఆకులను క్రమంగా తీసుకుంటే మొటిమలు, తామర, సోరియాసిస్‌తో వంటి సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
image credit to unsplash
ఉల్లిపాయలు చర్మంలో తేమను పెంచడంలో సహాయపడతాయి. పొడిబారడాన్ని తగ్గించడానికి తోడ్పడుతాయి.
image credit to unsplash
ఉల్లి ఆకులను క్రమంగా తీసుకోవటం వల్ల చర్మాన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతాయి. జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది. సెబమ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు