చలికాలంలో మొలకెత్తిన పెసర్లు తింటే ఇంత మంచిదా..! వీటిని తెలుసుకోండి

image source unsplash.com

By Maheshwaram Mahendra Chary
Dec 06, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో మొలకెత్తిన పెసర్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో అవసరమైన ప్రోటీన్ల కొరతను తొలగిస్తుంది. 

image source unsplash.com

పెసర్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణం సులువుగా అయ్యేందుకు సహాయపడే ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు కూడా దరి చేరవు. 

image source unsplash.com

మొలకెత్తిన పెసర్లలో విటమిన్ కె ఉంటుంది, రక్తం గడ్డకట్టే ప్రక్రియకు విటమిన్ కె అవసరం. ఇది ఎముకలకు పోషణ అందిస్తుంది, ఎముక సాంద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది.

image source unsplash.com

మొలకెత్తిన పెసర్లు బరువు తగ్గడంలో సహాయపడే ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. అవి అధిక పోషకాలను కలిగి ఉంటాయి కానీ తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి.

image source unsplash.com

చలికాలంలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే మొలకెత్తిన పెసర్లు తినడం గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

image source unsplash.com

మొలకెత్తిన పెసర్లు తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయి.

image source unsplash.com

పెసర్లు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పెసర్లను క్రమంగా తీసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి.

image source unsplash.com

రోజూ పెరుగు తింటున్నారా..! అయితే ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash