మిల్లెట్స్‌ తింటే ఏమవుతుంది..! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jul 05, 2024

Hindustan Times
Telugu

ప్రస్తుతం కాలంలో చిరుధాన్యాలు అమృతంలా మారాయి. చాలా మంది తమ ఆహారంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 

image credit to unsplash

ప్రొటీన్లు, ఎసెన్షియల్‌ అమినో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల మిల్లెట్స్‌  పోషక సంపన్న ఆహారంగా గుర్తింపు పొందాయి. 

image credit to unsplash

కాల్షియం ఎక్కువగా ఉన్న మిల్లెట్స్ కండరాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది. ఇందులో ఫెరులిక్ యాసిడ్, కాటెచిన్స్ వంటి ఫైటోన్యూట్రియెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి.

image credit to unsplash

మిల్లెట్స్ షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచివి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడమే కాదు... రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. 

image credit to unsplash

మిల్లెట్స్ లో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు తగ్గుతుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు వీటిని తింటే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.

image credit to unsplash

మిల్లెట్స్ లో కాల్షియం చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి. 

image credit to unsplash

టమిల్లెట్స్‌ని తీసుకోవాలనుకునే వారు డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది. మీ ఆరోగ్యం గురించి అన్ని విషయాలు మాట్లాడాకే.. ఎంత పరిమాణంలో తీసుకోవాలి...? ఎలా తీసుకోవాలనే దానిపై క్లారిటీ తీసుకోండి.

image credit to unsplash

దాంపత్యంలో భార్యభర్తల మధ్య చిన్న పాటి ఘర్షణలు సహజం. మీ బంధం మరింత బలపడేందుకు చిన్న చిన్న గొడవలు సహాయపడతాయంటున్నాయి అధ్యయనాలు. ఆరోగ్యకరమైన ఘర్షణ ఎందుకు అవసరమో తెలుసుకుందాం.  

pexels