బీట్ రూట్, క్యారెట్లను కలిపి తయారు చేసే జ్యూస్ ను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
image credit to unsplash
బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి.
image credit to unsplash
ఈ జ్యూస్ ను ప్రతిరోజూ తీసుకుంటే... అధిక బరువు పెరగకుండా ఉంటారు. ఇందులో తక్కువ కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
image credit to unsplash
ఈ జ్యూస్ లోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
image credit to unsplash
ఈ జ్యూస్ క్రమంగా తీసుకోవటం వల్ల ఎర్ర రక్త కణాల వృద్దికి తోడ్పడుతుంది. రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.
image credit to unsplash
ఈ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లతో నిండి ఉంటుంది. మీ చర్మంలో రక్త ప్రవాహాన్ని బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది.వీటిలో ఉండే విటమిన్లు చర్మానికి రక్షణగా నిలుస్తాయి.
image credit to unsplash
ఈ జ్యూస్ ను క్రమంగా తీసుకుంటే అధిక రక్తపోటును అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. బీట్ రూట్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
image credit to unsplash
బీట్రూట్ - క్యారెట్ జ్యూస్ ను క్రమంగా తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.