ఈ మొలకలు తింటే ఊహించని ఆరోగ్య లాభాలు -  వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 24, 2025

Hindustan Times
Telugu

క్యాబేజిలా కనిపించే బ్రసెల్స్‌ స్ప్రౌట్స్‌ ను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  బ్రస్సెల్స్ మొలకలను మినీ క్యాబేజీలు  అంటారు. 

image credit to unsplash

బ్రస్సెల్స్ స్ప్రౌట్స్‌ లో డైటరీ ఫైబర్, కాల్షియం, ఫోలేట్, ఐరన్, విటమిన్ సి, బి 6, కె వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి.

image credit to unsplash

బ్రస్సెల్స్ మొలకలు గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి.

image credit to unsplash

బ్రస్సెల్స్ మొలకలు తీసుకుంటే రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సీ ఇమిడి ఉంటుంది.  ఇన్‌ఫెక్షన్‌లను తగ్గిస్తుంది.

image credit to unsplash

బ్రస్సెల్స్ మొలకలలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముక సాంద్రతను పెంచటానికి సహాయపడుతుంది.

image credit to unsplash

బ్రస్సెల్స్ మొలకలు క్రమంగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.  బ్రస్సెల్స్ మొలకల్లో కెంప్ఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త నాళాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

image credit to unsplash

బ్రస్సెల్స్ మొలకలు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. శరీర బరువును నియంత్రించేందుకు సహాయపడుతాయి.

image credit to unsplash

చిన్న పిల్లలకు హార్ట్ ఎటాక్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Image Source From unsplash