చేదు అని వదిలేయకండి...! కాకరకాయలో బోలెడు పోషకాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 21, 2025

Hindustan Times
Telugu

కాకరకాయ అనగానే చాలా మంది మోహం చాటేస్తారు.  చేదుగా ఉంటుందని పక్కనపెడుతుంటారు. కానీ  ఉన్న పోషకాల విలువ తెలిస్తే మాత్రం ఔరా అనాల్సిందే.

image credit to unsplash

కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి, మొత్తం రోగనిరోధక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

image credit to unsplash

వీటిలో పొటాషియం, ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తికి ఉపయోగపడతాయి.

image credit to unsplash

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఏ, సి విటమిన్లు, జింక్‌, బయోటిన్‌ వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరిసేలా చేస్తాయి. 

image credit to unsplash

కాకరకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఉపయోగపడుతుంది. 

image credit to unsplash

కాకరకాయలో ఉండే చేదు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

image credit to unsplash

కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచిది. 

image credit to unsplash

అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..

pexels