ప్రస్తుత సీజన్ లో నేరేడు పండ్లు పుష్కలంగా దొరుకుతాయి.వీటిల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి.
image credit to unsplash
నేరేడు పండ్లలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. గుండె సక్రమంగా పనిచేసేందుకు పొటాషియం సహకరిస్తుంది. అంతేకాకుండా స్ట్రోక్ రాకుండా, హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నిరోధిస్తుంది.
image credit to unsplash
అల్లనేరేడు పండ్లు తింటే చర్మం కాంతివంతమవుతుంది. వీటిలోని యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
image credit to unsplash
వాయు కాలుష్యం కారణంగా ఎదురయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి నియంత్రిస్తాయి. వీటిలో ఉండే జింక్, విటమిన్ సి... ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.
image credit to unsplash
రక్తహీనత ఉన్నవాళ్లు ఈ పండ్లను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. రక్తహీనత సమస్యలను అధిగమించి... హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
image credit to unsplash
అజీర్తి నుంచి ఉపశమనం కలిగించి మలబద్ధకం సమస్యలు రాకుండా చూడటంలో నేరేడు పండ్లు సహాయపడుతాయి.
image credit to unsplash
నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిలువరించటంలో నేరేడు సహాయపడుతుంది. ఫలితంగా దంత సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.