శృంగారంతో ఆరోగ్య ప్రయోజనాలుంటాయా..?  ఈ విషయాలపై ఓ లుక్కేయండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 05, 2025

Hindustan Times
Telugu

శృంగారంతో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.  శృంగారంలో పాల్గొంటే చాలా మందికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివ్ మూడ్ ఏర్పడుతుంది. 

image credit to unsplash

శృంగార సమయంలో ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‍ను విడుదలవుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.

image credit to unsplash

రెగ్యులర్‌గా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి మెరుగైన నిద్ర పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

image credit to unsplash

లైంగిక ప్రేరేపణ వల్ల ఇమ్యునోగ్లోబిన్ ఏ ఉత్పత్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షల నుంచి శరీరాన్ని రక్షించేందుకు ఇది తోడ్పడుతుంది. శృంగారం వల్ల  రోగ నిరోధక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని పలు అధ్యయానాలు చెబుతున్నాయి. 

image credit to unsplash

సెక్స్‌లో తరచూ పాల్గొనడం వల్ల గుండెకు కూడా వ్యాయామంగా ఉంటుంది. శృంగారం చేసుకునే సమయంలో గుండె స్పందన రేటు, రక్త ప్రవాహం, ఆక్సిజన్ వినియోగం అధికమవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

image credit to unsplash

శృంగారంతో రక్తపోటు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శృంగారం ఒకరకమైన ఏరోబిక్‌, కండరాలను వృద్ధి చేసే వ్యాయామాల మాదిరి ప్రభావాన్ని చూపుతుంది. 

image credit to unsplash

ఆరోగ్యకరమైన, ఆనందమైన శృంగార సంబంధం భాగస్వాముల మధ్య అన్యోన్యమైన ప్రేమానుబంధాన్ని పెంచుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 

image credit to unsplash

పండ్లు నేరుగా తినడం మంచిదా.. జ్యూస్ మేలా?

Photo: Pexels