క్వినోవా తింటే గుండె సమస్యలు రావా..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 10, 2024

Hindustan Times
Telugu

గత కొంత కాలంగా ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టే వారు క్వినోవా తినేందుకు మొగ్గు చూపుతున్నారు. 

image credit to unsplash

తక్కిన ధాన్యాలతో పోలిస్తే క్వినోవాలో  పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. బ్రౌన్‌ రైస్‌లో కంటే వీటిలోనే ఎక్కువ. అందువల్ల ఇవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

image credit to unsplash

క్వినోవా తినటం వల్ల  మల బద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. పేగుల్లో వాపుల్లాంటివి ఉంటే తగ్గుతాయి. 

image credit to unsplash

 బరువు తగ్గాలనుకునే వారు క్వినోవాను  ప్రయత్నించవచ్చు. దీన్ని తినడం వల్ల ఊబకాయ సమస్య దరి చేరకుండా ఉంటుంది.

image credit to unsplash

క్వినోవా శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

image credit to unsplash

మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తినడం వల్ల ఫలితం ఉంటుంది. టైప్‌ టూ డయాబెటీస్‌ రాకుండా ఉంటుంది.

image credit to unsplash

క్వినోవాలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపు నుండి రక్షించడంలో సహాయపడతాయి.

image credit to unsplash

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay