ఈ 'టీ' చాలా స్పెషల్ గురూ... బరువు తగ్గడమే కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ 

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Feb 08, 2025

Hindustan Times
Telugu

మాచా టీ... ఇది గ్రీన్ టీని పోలి ఉండే జపనీస్ హెర్బల్ టీ. దీనిలోని అనేక ఔషధ లక్షణాలు మెరుగైన ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

image credit to unsplash

మాచా టీలో ఉండే కాటెచిన్‌లు  కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.

image credit to unsplash

మాచా టీ పొడిలో కెఫిన్, గాలెట్, ఎల్-థియనైన్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరు ప్రభావితం చేయటంతో ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

ఈ రకమైన టీ మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

image credit to unsplash

మాచా టీ రోజూ తీసుకుంటే.. బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని కాటెచిన్‌లు  జీవక్రియను మెరుగుపరుస్తాయని, కొవ్వును వేగంగా బర్న్‌ చేస్తాయని పేర్కొంటున్నారు.

image credit to unsplash

మాచా టీలో ఫ్లేవనాయిడ్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి.

image credit to unsplash

మాచా టీ.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా  ఇది గట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

డిన్నర్​ తర్వాత కొంచెం సేపు నడిచినా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

pexels