పచ్చి బఠానీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పైగా ఇది మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
image credit to unsplash
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. మీ ఆహారంలో బఠానీలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. బఠానీలను ఉడకబెట్టడం, కూరగాయలు లేదా సూప్ చేయడం ద్వారా కూడా తీసుకోవచ్చు.
image credit to unsplash
పచ్చి బఠానీలో బీ విటమిన్లు, విటమిన్ సీ, మెగ్నీషియం తదితర విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లడ్ షుగర్ అదుపులో ఉంచేందుకు దోహదపడతాయి.
image credit to unsplash
బఠానీలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి, కాబట్టి డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
image credit to unsplash
పచ్చి బఠానీతో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. చెడు బ్యాక్టీరియాను పెరగనివ్వదు.
image credit to unsplash
పచ్చి బఠానీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకారిగా ఉంటాయి.
image credit to unsplash
గ్రీన్ పీస్‌లో ఫైటిక్ యాసిడ్, లెక్టిన్‌లు వంటి యాంటీన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి ఇనుము, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
image credit to unsplash
వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.