గ్రీన్ కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా..! వీటిని తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Oct 17, 2024
Hindustan Times Telugu
గ్రీనా కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మ కణాలు నష్ట పోకుండా ఉండేలా చేస్తుంది.
image credit to unsplash
గ్రీన్ కాఫీ తాగటం వల్ల చర్మం ముడతలు రావడం, గీతలు పడటం లాంటి వయసు సంబంధిత సమస్యలన్నీ దరి చేరకుండా ఉంటాయి.
image credit to unsplash
బరువు తగ్గాలని అనుకునే వారు ఉదయాన్నే గ్రీన్ కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
image credit to unsplash
డయాబెటిస్ ఉన్న వారు కూడా ఎలాంటి అనుమానమూ లేకుండా గ్రీన్ కాఫీ తాగవచ్చు. దీనిలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ అనేది పిండి పదార్థాల్ని శరీరం ఎక్కువగా శోషించుకోనీయకుండా అడ్డు పడుతుంది.
image credit to unsplash
గ్రీన్ కాఫీని మంచి సహజమైన డిటాక్సిఫయర్‌గా చెబుతారు. దీన్ని క్రమం తప్పకుండా రోజూ ఒక కప్పు చొప్పున తీసుకుంటూ ఉండటం వల్ల విష పదార్థాలు, వ్యర్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.
image credit to unsplash
గ్రీన్ కాఫీని క్రమంగా తీసుకోవటం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
image credit to unsplash
గ్రీన్ కాఫీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అయితే ఎక్కువ మోతాదులో కాకుండా రోజుకూ ఒకటి నుంచి రెండు కప్పుల గ్రీన్ కాఫీ తీసుకోవచ్చు.