జిన్సెంగ్ హెర్బల్ టీ  - ఈ ఆరోగ్య లాభాలు తెలిస్తే మీరూ ట్రై చేస్తారు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 21, 2024

Hindustan Times
Telugu

ఆయుర్వేదంలో వినియోగిస్తున్న ప్రభావంతమైన మూలికల్లో జిన్సెంగ్ ఒకటి. ఇది ఒక పురాతనమైన ఔషధం. 

image credit to unsplash

జిన్సెంగ్ వేర్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే పాలీ ఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటివి ఉంటాయి. ఈ టీ తాగటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.

image credit to unsplash

జిన్సెంగ్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా జిన్సెంగ్ కాపాడుతుంది. 

image credit to unsplash

జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంచడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి జిన్సెంగ్ ఉపయోగపడుతుంది. 

image credit to unsplash

జిన్సెంగ్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయని తెలుస్తోంది.

image credit to unsplash

జిన్సెంగ్  వేర్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

image credit to unsplash

జిన్సెంగ్‌... లైంగిక సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. ఆహారంలో భాగం చేసుకోవాలనుకునేవారు ఆయుర్వేద వైద్యుల సలహాను పాటించడం చాలా ముఖ్యం.

image credit to unsplash

ప్రశాంతంగా జీవించేందుకు ఈ ఐదు టిప్స్ పాటించండి

Photo: Pexels