రోగనిరోధక శక్తి పెరగాలా..? అయితే బ్రోకలీ గురించి తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jun 13, 2025
Hindustan Times Telugu
బ్రోకలీని క్రమంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
image credit to unsplash
బ్రొకలీలో విటమిన్ సీ, కేలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
image credit to unsplash
బ్రొకలీలో నారింజ కన్నా రెండురెట్లు అధికంగా సి విటమిన్ ఉంటుంది. మిగతా పండ్లతో పోలిస్తే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ దీనిలో ఎక్కువ ఉంటుంది.
image credit to unsplash
బ్రోకలీలో ఫోలేట్, పొటాషియం, మాంగనీసు లాంటివీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
image credit to unsplash
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం. కాల్షియంని ఇవి బాగా శోషించుకోవాలంటే కే విటమిన్ ఉండాలి. ఇవి రెండూ బ్రోకలీలో పుష్కలంగా ఉంటాయి.
image credit to unsplash
బ్రోకలీలో సల్ఫోరాఫేన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
image credit to unsplash
బ్రోకలీలో ఉన్న సల్ఫోరాఫేన్ అనేది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి తోడ్పడుతుంది. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి.
image credit to unsplash
చామదుంపలతో ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!