నీరు తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటి?

pexel

By Ramya Sri Marka
Feb 16, 2025

Hindustan Times
Telugu

ఆరోగ్యంగా ఉండాలంటే, నీరు తాగాలని అందరూ చెప్తుంటారు. చాలా ప్రయోజనాలున్నాయని కూడా సూచిస్తుంటారు. కానీ, అవేంటో ఎప్పుడైనా ఆలోచించారా.. 

హైడ్రేషన్ - శరీరంలో పలు విధులు సరిగ్గా జరగడానికి హైడ్రేషన్‌తో ఉండటం తప్పనిసరి. రసాయన చర్యలు సరిగ్గా జరిగి సమర్థవంతమైన పనితీరు కనబడుతుంది.

ప్రసరణ మెరుగుపరచడం - రక్తంలో పోషకాలు, మినరల్స్ ప్రసరణను మెరుగుపరుస్తుంది.

కణాల పనితీరు - శరీర పనితీరును క్రమబద్దీకరించే కణాలను రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

డిటాక్సిఫికేషన్ - శరీరంలో ఉన్న హానికారకాలను యూరిన్ ద్వారా, ఇతర ప్రక్రియల ద్వారా తొలగిస్తుంది. 

రెగ్యూలేషన్ - శరీరంలో ఉండాల్సిన నీటి శాతాన్ని సమతుల్యం చేసి అవసరమైన మేరకు హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది.

పరిపూర్ణ ఆరోగ్యం - శరీరంలో అన్ని పనులకు సహకారం అందించి, జీర్ణక్రియను సజావుగా జరిపి, వేస్టేజ్ ను బయటకు పంపుతుంది.

నీరు శరీర విధులను క్రమబద్దీకరించి, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ సరైన మొత్తంలో నీరు తాగడం ఉత్తమం.

నీరు తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటి?

అద్భుత ఔషధ గుణాల గని అవెనా సతైవా...