జీర్ణాశయం ఎర్రగా పొక్కినా, జీర్ణాశయంలోని ఆమ్లం అన్నవాహికలో  ఎగదన్నినా అన్నం అరగలేదని అంటుంటాము.

By Bolleddu Sarath Chandra
Dec 28, 2024

Hindustan Times
Telugu

ఎక్కువ ఆహారాన్ని ఒకేసారి గబగబా మింగితే  ఆహారం అరుగుదలలో సమస్యలు తలెత్తవచ్చు.

కొంతమందిలో ఆహారం తినడంతో సంబంధం లేకుండా కూడా ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు తలెత్తవచ్చు. 

ఆహారం అరగకపోతే కడుపు నొప్పి, కడుపులో మంట, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోతే పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. 

ఆహారం సరిగా అరగకపోతే పుల్లటి త్రేన్పులు రావడం, నోట్లో నీళ్లు ఊరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఆకలి లేకపోవడం, ఆపాన వాయువులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అన్నం అరుగుదల లేకపోవడంతో పాటు కారణం లేకుండా బరువు తగ్గుతుంటే వైద్యుల్ని సంప్రదించాలి

55ఏళ్లు పైబడిన వారిలో అరుగుదల సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

కడుపులో తీవ్రమైన నొప్పి, నొప్పి క్రమంగా పెరుగుతూ ఉన్నా వెంటనే డాక్టరును కలవాలి.

జీర్ణశక్తి తగ్గడానికి   ఆందోళన, మానసిక  ఒత్తిడి, అతిగా మద్యం సేవించడం వంటి కారణాలు ఉంటాయి. 

పొగతాగే వారిలో, కీళ్ల నొప్పులకు ప్రత్యేకంగా మందులుు వాడే వారిలో అరుగుదల సమస్య ఉంటుంది. 

జీర్ణాశయంలో  ఆమ్లాలను ఎగదన్నేలా  చేసే జబ్బులో కూడా అరుగుదల సమస్యలు ఉంటాయి. 

జీర్ణాశయం, ఆంత్రమూలంలో పుళ్లు పడినా ఆకలి మందగిస్తుంది. 

హెచ్‌ పైలోరీ అనే క్రిముల కారణంగా వచ్చే జీర్ణాశయ జబ్బులు, ఉదరంలోకి సక్రమంగా ఆహారం చేరకపోవడం వంటి కారణాలతో కూడా అరుగుదల లోపిస్తుంది. 

గర్భవతుల్లో కూడా అన్నం అరగకపోవడం వంటి లక్టణాలు కనిపిస్తాయి. ఆకలి మందగించడానికి కనిపించే లక్షణాలను బట్టి రోగ నిర్దారణ చేస్తారు. 

 క్యాల్షియం తక్కువగా ఉందా..? అయితే రాగులు తీసుకోవాల్సిందే

image credit to unsplash