చెమట శరీరంలో కావలసినంత నీటిని ఉంచి, అదనపు నీటిని బయటకు పంపుతుంది.
శరీరంలో ఉష్ణోగ్రతను సమతూకస్థితిలో ఉంచడానికి చర్మం ఉపయోగ పడుతుంది
చెమట శరీరంలో అదనంగా ఉండే లవణాల్ని బయటకు విసర్జిస్తుంది. శరీరంలోని ద్రవాల ఆమ్ల, క్షార గుణాలను శరీరానికి అవసరమైన విధంగా ఉంచుతుంది.
చంకల్లోనూ, మగవారి ఛాతీ మీద, మర్మావయవాల మీదా "ఎపోక్రైన్" గ్రంథులు ఉంటాయి. వీటి నుండి వచ్చే చెమట ఒక రకమైన మదపు వాసనతో ఉంటుంది.
చెమటలో సుమారుగా 99.2 శాతం పైగా నీరు, మిగతా 0.5 శాతంలో యూరియా, సోడియం క్లోరైడ్, లాక్టిక్ యాసిడ్, షుగర్, సల్ఫేటు మొదలగు పదార్థాలూ ఉంటాయి.
సోడియం క్లోరైడు వలన చెమటకి ఉప్పటి రుచి వస్తుంది. చెమట అనేది శారీరక కారణాల వలన, మానసిక కారణాల వలనా పడుతుంది.
బయట వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నా, జ్వరం వచ్చినా, ఎండలో తిరిగినా, చర్మంలో ఉండే కేశరక నాళికల్లోకి ఎక్కువ రక్తం ప్రవహించి చెమటను విడుదల చేసి శరీరాన్ని చల్లబరుస్తుంది.
మానసికమైన ఆందోళన ఉన్నప్పుడు నాడీవ్యవస్థ సరాసరి స్వేదగ్రంథుల్ని ఆదేశించటం వలన అరిచేతుల్లోనూ పాదాలలోనూ చెమట పడుతుంది.
కష్టపడి పని చేసినప్పుడు చెమట ఎటూ పడుంది.
హెల్తీ స్పెర్మ్ కౌంట్ కోసం ఈ ఆహారాలు తినాల్సిందే!