రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరత కారణంగా రేషనింగ్ విధానం అమలు చేశారు. ఆహార నియంత్రణ వల్ల మధుమేహం గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు.
శరీర బరువు తగ్గితే, మధుమేహం కూడా అదుపులోకి వస్తున్నట్టు పలు పరిశోధనల్లో రుజువైంది.
రేషన్ విధానం, బేరియాటిక్ చికిత్సలలో కొంత కాలం తర్వాత మధుమేహం తిరిగి వస్తున్నట్టు గుర్తించారు.
మధుమేహంలో శరీరంలో గ్లూకోజ్ శరీరం మొత్తం నిండిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా చక్కెరలను తీసుకోవడం ఆపాలి. శరీరంలో నిల్వ ఉన్న చక్కెరలను కరిగించాలి. దీనికి ఉపవాసం చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది.
తక్కువ కార్బో హైడ్రేట్స్ ఉన్న ఆహారాలతో గ్లూకోజ్ వేగంగా నియంత్రణలోకి వస్తుంది.
వ్యాయామం ద్వారా మధుమేహంలో కీలకమైన ఫ్యాటీ లివర్ సమస్య అదుపులోకి రాదు.
శరీరంలో అదనంగా ఉన్న చక్కెరలను తొలగించాలంటే ఉపవాసం ఉపయోగపడుతుంది.
శరీరం తీసుకునే ఆహారాన్ని క్రమంగా నియంత్రిస్తే మెటబాలిక్ రేటు కూాడా తగ్గుతుంది.
ఉపవాసంలో శరీర జీవ క్రియల రేటు తగ్గకపోగా, అదనపు క్యాలరీల ఖర్చు మరింత పెరుగుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
ఆగి ఆగి ఉపవాసం చేసే పద్ధతిలో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది.
ముందస్తు మధుమేహాన్ని, టైప్ 2 డయాబెటిస్‌ను ఉపవాసాలు వెనక్కి తీసుకువెళ్తాయి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ప్రమాకరమైన విసరిల్ కొవ్వులు కరిగిపోతున్నట్టు గుర్తించారు. ఊబ పొట్ట కూడా ఉపవాసంతో తగ్గుతుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉపవాసంతో తగ్గుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు, ఇన్సులిన్ స్థాయిలు తగ్గుముఖం పట్టినట్టు గుర్తించారు.
లో కార్బ్ హెల్తీ ఫాట్ డైట్, ఉపవాసాలను కలిపి చేస్తే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
రోజూ బంగాళాదుంపలు తినడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు