ఆగండి..ఆగండి! పుచ్చకాయ గింజలను పడేసే ముందు ఇది తెలుసుకోండి!
pixabay
By Ramya Sri Marka Mar 17, 2025
Hindustan Times Telugu
వేసవి వచ్చిందంటే కనీసం రెండు రోజులకు ఒకసారైన ఒక పుచ్చకాయ తింటుంటాం. కాయను తిని వాటి గింజలను పడేస్తుంటాం. ఇలా పుచ్చకాయ గింజలను పడేయడం వల్ల మనం ఎంత నష్టపోతామో తెలుసా?
పుచ్చకాయ గింజల వల్ల కలిగే లాభాలు తెలిస్తే వాటిని పడేయడానికి మీకు మనసే రాదు. గుండె నుండి చర్మం వరకూ, ఒత్తిడి నుంచి వీర్య కణాల వరకూ పుచ్చకాయ గింజలతో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.
pixabay
పుచ్చకాయ గింజల్లో ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
pixabay
ఈ గింజల్లో లభించే జింక్, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి.
pixabay
పుచ్చకాయ గింజల్లో పోషకాలు ఎక్కువ, కేలరీల తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటిఆహార పదార్థం.
pixabay
వీటిలో ఉండే సిట్రెలిన్ సమ్మేళనం రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటీస్‌కు దూరంగా ఉంచుతుంది.
pixabay
పుచ్చకాయ గింజల్లో అధికంగా లభించే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణవ్యవస్థను, శరీర బరువును అదుపులో ఉంచుతుంది.
pixabay
ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటివి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.
pixabay
పుచ్చకాయ గింజల్లోని జింక్, సెలీనియంలు ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంచుతాయి.
pixabay
ఇవి వీర్య కణాల సంఖ్యను, నాణ్యతను పెంచడలంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులోని జింక్ పురుషుల హార్మోన్ల సమతుల్యతను పెంచి, పునరుత్పత్తి వ్యవస్థకు మేలు చేస్తుంది.
pixabay
పుచ్చకాయ గింజల్లోని పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వెంట్రుకలు చిట్లిపోవడం, తలలో దురద వంటి సమస్యలను నయం చేస్తాయి.
పుచ్చకాయ గింజలను నేరుగా తినచ్చు, వేయించి తినచ్చు.లేదా గింజలను మరిగించి వడకట్టి ఆ నీటిని కూడా తాగచ్చు. పుచ్చకాయ గింజల టీకూడా తాగచ్చు. సలాడ్లలో, పెరుగులో, సూప్ లలో కూడా వేసుకుని తినచ్చు. ఎలా తిన్నా మితంగా తింటే అన్ని ప్రయోజనాలను పొందచ్చు.
pixabay
గర్భిణులు బీన్స్ గింజలు తినవచ్చా.. ఉపయోగాలు ఏంటి? 8 అంశాలు