సూర్య నమస్కారం ఎందుకు చేయాలి.. ఉపయోగాలు ఏంటి?

Image Source From unsplash

By Basani Shiva Kumar
May 17, 2025

Hindustan Times
Telugu

సూర్య నమస్కారంలోని 12 భంగిమలు శరీరంలోని వివిధ భాగాలపై పనిచేస్తాయి. కండరాలు, కీళ్లను బలపరుస్తాయి. ఇది శరీరానికి మంచి బలాన్ని అందిస్తుంది.

Image Source From unsplash

కొన్ని భంగిమలు ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

Image Source From unsplash

సూర్య నమస్కారం క్రమం తప్పకుండా చేయడం వల్ల.. శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యానికి, మెరుపునకు సహాయపడుతుంది.

Image Source From unsplash

వేగవంతమైన టెంపోతో సూర్య నమస్కారాలు చేయడం వల్ల.. కేలరీలు బర్న్ అవుతాయి. జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash

శ్వాస, కదలికలపై దృష్టి పెట్టడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

Image Source From unsplash

సూర్య నమస్కారం శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Image Source From unsplash

సూర్య నమస్కారం.. ఊపిరితిత్తులను బాగా వెంటిలేట్ చేస్తుంది. రక్తాన్ని ఆక్సిజనేట్ చేస్తుంది. తద్వారా శరీరం నుండి విష పదార్థాలు తొలగిపోతాయి.

సూర్య నమస్కారం శరీరం, మనస్సును విశ్రాంతింపజేస్తుంది. ఇది నిద్రలేమిని తగ్గించడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు