చర్మ సౌందర్యానికి కీర దోసకాయ - కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 15, 2024

Hindustan Times
Telugu

కీరదోసలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మానికి చల్లదనం ఇస్తాయి. ఎండ నుంచి రాగానే చర్మం మంటగా అనిపించినపుడు ఒక కీరదోస ముక్క రుద్దుకొని చుడండి, హాయిగా ఉంటుంది. 

image credit to unsplash

కీర దోసకు  చర్మాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. దీన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

image credit to unsplash

 కీరదోసకి చర్మ రంధ్రాలని బిగుతుగా చేసి , నూనె ఉత్పత్తిని తగ్గించే గుణం ఉంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకి ఇది బాగా పనిచేస్తుంది. 

image credit to unsplash

కీరలో ఉండే విటమిన్ సి వల్ల చర్మం మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి. కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలని కూడా కీరా తగ్గిస్తుంది. 

image credit to unsplash

కీరదోసతో వివిధ ఫేస్ ప్యాకులు వేసుకుంటే కూడా చాలా ప్రయోజనాలున్నాయి. కీరాను ముద్దలాగా చేసి ఒకట్రెండు చుక్కల నిమ్మరసం, కొంచెం తేనె కలపాలి. ఈ గుజ్జును ముఖానికి పట్టించి 10 నిముషాలు ఉంచుకుని కడిగేసుకుంటే ముఖం తాజాగా అనిపిస్తుంది. 

image credit to unsplash

మొటిమల సమస్య ఉంటే కీరాతో పాటు కలబంద లేదా అలోవెరా జెల్ కలుపుకొని ముఖం, మెడకు పట్టించండి. నల్లటి మచ్చలున్నా కూడా తగ్గుముఖం పడతాయి. 

image credit to unsplash

కళ్లు కాస్త ఉబ్బినట్టు అనిపించినా, లేదా అలిసినట్టు అనిపించినా కళ్ల మీద గుండ్రంగా తరిగిన కీరా ముక్క పెట్టుకుని విశ్రాంతి తీసుకోండి. చల్లగా అనిపిస్తుంది.

image credit to unsplash

మీ ఇంట్లోవాళ్లు ఎప్పుడైనా ఇలా చేశారా.. అయితే అల్జీమర్స్ వ్యాధి రావొచ్చు!

Image Source From unsplash