కోడి గుడ్డులో లభించే ప్రొటీన్లు అత్యంత విలువైనవి, ఇవి తేలికగా జీర్ణం అవుతాయి. పోషకాల్లో మిగిలిన పదార్ధాల నుంచి లభించే ప్రొటీన్ల కంటే గుడ్ల నుంచి లబించే ప్రొటీన్లను ప్రామాణికంగా పరిగణిస్తారు.
గుడ్డు ద్వారా లభించే పోషక విలువల్లో ఎక్కువ భాగం అందులో పచ్చసొన నుంచి లభిస్తుంది. గుడ్డులో లభించే విటమిన్ బి 12 ప్రొటీన్లలో సగభాగం తెల్ల సొన నుంచి లభిస్తాయి.
కోడి గుడ్ల నుంచి లభించే ప్రొటీన్లు అల్బుమిన్ల రూపంలో ఉంటాయి. ఇవి త్వరగా గడ్డ కట్టే గుణం కలిగి ఉంటాయి. అల్బుమిన్‌తో పాటు అవిడిన్, కొనాల్బిన్ వంటి ప్రొటీన్లు కూడా ఉంటాయి.
బాతు గుడ్లలో ట్రిస్పిన్ ఇన్‌హిబిటర్ అనే పదార్ధం ఉంటుంది. శరీరంలో ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రొటీన్ మీద పనిచేయకుండా చేస్తుంది.
గుడ్డును ఉడకబెట్టినా, వండిన అందులో ఉండే ట్రిప్సిన్ నశిస్తుంది.
అందుకే గుడ్డును ఎప్పుడు ఉడకబెట్టి మాత్రమే తినాలి. పచ్చి గుడ్లను ఆహారంగా తీసుకోకూడదు. వండిన, ఉడకబెట్టినవి మాత్రమే తినాలి.
కోడి గుడ్డు పచ్చ సొనలో 200 నుంచి 250 మిల్లీ గ్రాముల వరకు కొలెస్ట్రరాల్ ఉంటుంది.
కొలెస్టరాల్ అధికంగా ఉన్న వారు గుడ్డులో పచ్చ సొన తొలగించి తెల్ల సొన మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.
గుడ్డును ఏ కాలంలోనైనా ఆహారంగా తీసుకోవచ్చు.
గుడ్లు తింటే మొటిమలు వస్తాయనేది అపోహ మాత్రమే. కొందరిలో గుడ్డు తిన్నపుడు అలర్జీకి గురవుతారు. కడుపులో నొప్పి, విరోచనాల బారిన పడతారు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో.. వృద్ధులు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు పచ్చిగుడ్లను, సగం ఉడికిన గుడ్లను అసలు తినకూడదు.
పగిలిన గుడ్లను ఆహారంగా తీసుకుంటే టైఫాయిడ్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. చిట్లిన గుడ్లను కూడా తినకూడదు. గుండె జబ్బుల బారిన పడిన వారు, 35-40 ఏళ్ల వయసు ఉన్న వారు గుడ్లను పచ్చ సొన లేకుండా తినొచ్చు.