రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ అనేవి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని కచ్చితంగా తినాలి.
Unsplash
By Anand Sai Nov 12, 2024
Hindustan Times Telugu
రాజ్మా అనేది ఆరోగ్యానికి మేలు చేసే ఒక చిక్కుడు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
Unsplash
రాజ్మాలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వలన కండరాల నిర్మాణానికి, శరీర బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.
Unsplash
రాజ్మాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సాయపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
Unsplash
రాజ్మాలోని ఫోలేట్ అనే విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హోమోసిస్టైన్ స్థాయిలను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Unsplash
రాజ్మాలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో డయాబెటీస్ నివారించుకోవచ్చు.
Unsplash
రాజ్మాలోని యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సాయపడుతుంది.
Unsplash
ఒకరు రోజుకు హాఫ్ కప్పు నుంచి ఒక కప్పు రాజ్మా తింటే సరిపోతుంది. అతిగా కూడా తినకూడదు.
Unsplash
తేనె సంపూర్ణ ఆహారమే కాకుండా సర్వరోగ నివారిణిగా కూడా పనిచేస్తుంది. తేనెను అమృతంగా కూడా పరిగణించవచ్చు. ఎన్ని సంవత్సరాలు పాటు నిల్వ చేసినా దాని రంగు, రుచిలో ఎలాంటి మార్పు ఉండదు.